MLA Rajasingh : పోలీసులతో పెట్టుకోకు కేటీఆర్ : ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Rajasingh : పోలీసులతో పెట్టుకోకు కేటీఆర్ : ఎమ్మెల్యే రాజాసింగ్
X

పోలీసులు అధికారంలో ఉన్న వారి మాటలే వింటారని, వాళ్లతో పెట్టుకోవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పోలీసు అధికారులు కేటీఆర్ ఆదేశంతో, రేవంత్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లోకి చొరబడి, ఆయన బెడ్ రూమ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపారని గుర్తు చేశారు. ఇవాళ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ సమయంలో తనని అరెస్టు చేసిన వాళ్ళని ఏమీ చేయలేదని అన్నారు. కేటీఆర్ "మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాము" అంటున్నారని, పోలీసుశాఖతో పెట్టుకోవద్దని అన్నారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాటనే వింటారని అన్నారు. తనపైనా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించా రని గుర్తు చేశారు. తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో బీజేపీ నేతలు కొందరు పోలీసులకు సపోర్టుగా ఉన్నారన్నా రు. అప్పుడో పోలీసు అధికారి "రాజాసింగ్ ! నీ పైన పీడీ యాక్ట్ వేస్తున్నాం. మీ బీజేపీ వాళ్లు కూడా వేయండి అన్నారు." అని చెప్పారు.

Tags

Next Story