KTR Respond : సీఎం రేవంత్ తీరుపై కేటీఆర్ ఘాటు స్పందన

KTR Respond : సీఎం రేవంత్ తీరుపై కేటీఆర్ ఘాటు స్పందన
X

ఢిల్లీ కాంగ్రెస్ హామీల పోస్టర్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా ఉందంటూ సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి, ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టారంటూ మండిపడ్డారు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన ఢిల్లీలో కూడా చేయిస్తానంటూ పులకేశి బయలుదేరాడని అన్నారు. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగ ఇక్కడ హామీలకు దిక్కులేదు గానీ అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా? అని ప్రశ్నించారు. ‘‘ ఇక్కడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా? ఢిల్లీ గల్లీల్లో కాదు, దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం. జాగో ఢిల్లీ జాగో’’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

Tags

Next Story