KTR : జైలుకు వెళ్లొచ్చాక పోరాటం కొనసాగిస్తా.. కేటీఆర్ హాట్ కామెంట్

తెలంగాణ భవన్ వద్ద పలువురు లగచర్ల గ్రామస్తులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వారి సమస్యలు తెలియజేశారు. అనంతరం కేటీఆర్ మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని కేటీఆర్ అన్నారు. పోలీసులు, ఐపీఎస్ అధికారులారా ఇంత స్వామి భక్తి వద్దని వార్నింగ్ ఇచ్చారు. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరని ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారని, కానీ అదంతా బక్వాస్ అని పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాశారని వెల్లడించారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లినట్లు వెళ్లారని ఫైర్ అయ్యారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టమొచ్చినట్లు కొట్టారని మండిపడ్డారు. నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంత పిచ్చోడు మరొకరు ఉండరని, జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఏపీలో అధికారులకు పట్టిన గతే నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ప్రస్తుత అధికారులకు పడుతుందన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com