MP Chamala : కేటీఆర్..రాష్ట్రం మిమ్మల్నిఫేక్ రావుగా భావిస్తోంది : ఎంపీ చామల

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ విమర్శలు చేశారు. కేటీఆర్.. రాష్ట్రం మిమ్మల్ని ఫేక్ రావుగా భావిస్తోందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. లగచర్లలో కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడి గురించి ప్రస్తా వించారు. 'పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు.. కేటీఆర్ పవిత్ర హృదయంతో.. (ఆయనకు పవిత్ర హృదయం ఉందో లేదో డౌటే.. ఐనా.. ఈ ఒక్క రోజైనా కుట్రలు, కుతంత్రాలను పక్కన పెట్టి.. నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ పథకం ప్రకారం కలెక్టర్, ఇతర అధికారుల పై దాడి కుట్రను అమలు చేసిన సురేష్ మీ పార్టీ నాయకుడే అని.. మీరే ప్రకటించారు. సురేష్ కు భూసేకరణ పరిధిలో ఏడు ఎకరాల పొలం ఉందని కూడా మీరే ప్రకటించారు. అధి కారుల విచారణలో అసలు ఆ గ్రామంలో సురేష్ కు గానీ, ఆయన సోదరుడికి గానీ ఇంచు భూమి కూడా లేదని విస్పష్టంగా తేలింది. దీనికి మీ సమాధానం ఏమిటి కేటీఆర్!? ఇందుకే కదా.. మిమ్మల్ని ఫేక్ రావు గా తెలంగాణ భావిస్తోంది!!' అని పేర్కొన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com