KTR : నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్

KTR  : నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్
X

ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఏసీబీ ఎదుట హాజరుకానున్నారు. సోమవారమే విచారణకు వచ్చిన ఆయన తన లాయర్‌ను లోపలికి అనుమతించడం లేదంటూ తిరిగి వెళ్లిపోయారు. దీంతో అదేరోజు ఏసీబీ ఆయనకు నోటీసులు జారీ చేసి, 9న విచారణకు రావాలని పేర్కొంది. అటు లాయర్‌కు విచారణ గదిలోకి అనుమతి ఉండదని నిన్న హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ ఇవాళ విచారణకు ఒక్కరే వెళ్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

మరోవైపు ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు విచారణ సాగింది. అరవింద్‌ను ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం విచారించింది. విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక కారణం, ఎవరి అనుమతితో బదిలీ చేశారు? నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేసుకున్నారు.

Tags

Next Story