కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్ ట్వీట్

కేంద్రం నుంచి తెలంగాణకు వస్తున్న నిధులపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2014 నుంచి పన్నుల రూపంలో 2లక్షల72 వేల కోట్లు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందన్నారు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి కేవలం లక్షా 40 వేల కోట్లు మాత్రమే వచ్చాయంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. భారత ఆర్ధిక రంగాన్ని పరిపుష్టం చేయడంలో తెలంగాణ విజయవంతమైన పాత్ర పోషిస్తోందన్నారు మంత్రి కేటీఆర్. 2014 నుంచి 2020 వరకు ఏటా ఎంత చెల్లించింది, ఎంత తీసుకుంది లెక్కలతో సహా షేర్ చేశారు. దుబ్బాక ప్రచారానికి తెరపడుతున్న వేళ.. తెలంగాణ ప్రజలకు ఇది తెలియాలంటూ ఆయన ట్వీట్ చేశారు.
2014- 2020 మధ్యలో దేశ తలసరి ఆదాయం 54.9 శాతంగా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం భారీగా పెరిగి 83.9 శాతంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ చేపట్టిన అపూర్వమైన పరిపాలన విధానాల వల్లనే రాష్ట్ర జీడీపీ భారీగా పెరిగిందన్నారు. ఇది దేశ సగటు కంటే అధికంగా ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ వంటి అన్ని రంగాల్లోనూ వృద్ధి కొనసాగిందన్నారు మంత్రి కేటీఆర్.
The people of Telangana should know that since 2014, our state's contribution to Centre in the form of taxes is a whopping ₹2,72,926 Cr whereas what Centre has released to Telangana is ₹1,40,329 Cr!
— KTR (@KTRTRS) November 1, 2020
Telangana continues to be a pillar of strength for India 💪#TelanganaEconomy pic.twitter.com/07UANGDQe3
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com