KTR: గుజరాత్‌లో పవర్ హాలిడే.. కేటీఆర్ ఘాటు విమర్శలు..

KTR: కేంద్రంలోని BJPతో ఓ పక్క వరి వార్ కంటిన్యూ చేస్తున్న TRS.. గుజరాత్ మోడల్‌పైనా ఘాటైన విమర్శలు చేస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌లో వారానికి ఒక రోజు పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించడాన్ని చూపించి ఇదేనా డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటే అంటూ ఎద్దేవా చేస్తోంది. గుజరాత్‌లో పవర్ హాలీడేకి సంబంధిచి మంత్రి KTR చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
'పవర్ ఫుల్ వ్యక్తులు వచ్చిన రాష్ట్రంలో ఇండస్ట్రీస్‌కి పవర్ హాలీడే' అంటూ ర్యాగింగ్ చేశారు. గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ జారీ చేసిన లెటర్‌ను తన ట్వీట్‌కి జత చేశారు. ఇది డబుల్ ఇంజినా.. ట్రబుల్ ఇంజినా అంటూ సూటిగానే ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండే అభివృద్ధి పరుగులు పెడుతుందనే ఉద్దేశంతో BJP పదేపదే చెప్పే డబుల్ ఇంజిన్ గ్రోత్ మోడల్ ఇదేనా అంటూ సటైర్లు వేశారు.
Power holiday for industry in the state of Gujarat where powerful people come from!!
— KTR (@KTRTRS) March 30, 2022
Double engine or Trouble engine? pic.twitter.com/kBdk0eH1wu
తెలంగాణలో బలపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న BJPని టార్గెట్ చేసేందుకు ఈ అవకాశాన్ని KTR సరిగ్గా ఉపయోగించుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల సొంత గడ్డ గుజరాత్‌లో ఈ పరిస్థితులు ఇవిగో అంటూ ట్విట్టర్ వేదికగానే చెప్పుకొచ్చారు. గుజరాత్ మోడల్ ఏమీ అద్భుతం కాదనే విషయాన్ని క్లియర్ కట్‌గా ఒక్క ట్వీట్‌తో ప్రజెంట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com