KTR : కేటీఆర్ యూటర్న్.. ఏసీబీ ఆఫీస్ వద్ద హైడ్రామా

KTR : కేటీఆర్ యూటర్న్.. ఏసీబీ ఆఫీస్ వద్ద హైడ్రామా
X

హైదరాబాద్ లోని ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. బంజారాహిల్స్‌ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులు ఎవరూ కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో కేటీఆర్ వాదనకు దిగారు. లాయర్లను అనుమతించకపోవడంతో ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే కేటీఆర్‌ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్ కు చేరారు. నెక్స్ట్ ఏం చేయాలనేదానిపై ఏసీబీ అధికారులు చర్చిస్తున్నారు. కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags

Next Story