KTR : తెలంగాణలో మరో ఉద్యమం.. కేటీఆర్ ట్వీట్ వైరల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులు నెలకొన్నాయంటూ పోస్ట్ చేశారు కేటీఆర్. మళ్లీ ప్రత్యర్థి కాంగ్రెస్సేనని.. ప్రజల పక్షాన నిలబడింది బీఆర్ఎస్సేనన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీతో రైతులను మోసం చేసిన అమానుషం, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయని దుర్మార్గం అంటూ విరుచుకుపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల జాతర అనే హామీకి పాతరేసి నిరుద్యోగుల ఆశలను చిదిమేసి, రోడ్డెక్కినా కనికరించడం లేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సకల జనుల సంక్షేమ తెలంగాణ.. నేడు కాంగ్రెస్ పాలనలో సంక్షోభం వైపు పయనం అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తెలంగాణ అగ్గై మండుతోందన్నారు. సర్కార్ విధానాలపై జనం తిరగబడుతున్నారన్నారు. తెలంగాణ దళం.. గళం ఎప్పటికీ బీఆర్ఎస్సేనని.. పేగులు తెగేదాకా ప్రజల కోసం కొట్లాడుతాం.. తెలంగాణను అవకాశవాదుల నుంచి కాపాడుకుంటామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com