KTR Warning : రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సోనియాగాంధీని దెయ్యం, పిశాచి, బలి దేవత అని అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది అని విమర్శించారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి రాజీవ్‌గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలు రంగు అందరికీ తెలుసని అన్నారు. ‘నీ ఆలోచనల్లో కుసంస్కారం.. నీ మాటలు అష్ట వికారం’ అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలు ఏంటని అడిగితే కారుకూతలు కూస్తావా అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అని విరుచుకుపడ్డారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తాం అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మళ్లీ చెబుతున్నాం.. రాసి పెట్టుకో అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com