KTR : ఇంటింటికీ తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తాం: కేటీఆర్

KTR : ఇంటింటికీ తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తాం: కేటీఆర్
X

ఇంటింటికీ తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ నేతలతో భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘రాష్ట్రంలో 60శాతం మందికి రుణమాఫీ కాలేదు. ఎల్లుండి నుంచి వివరాలు సేకరిస్తాం. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జిని నియమిస్తాం. కలెక్టర్లకు నివేదికలు సమర్పిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’ అని చెప్పారు.

రుణమాఫీపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ నామమాత్ర రుణమాఫీ చేసిందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రేపటి నుంచి రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టనున్నారు.

మరోవైపు అర్హత ఉన్నా రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుందని తెలంగాణ కాంగ్రెస్ తెలిపింది. ‘ఇంటింటికి వెళ్లి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఆధార్‌లో తప్పులుంటే ఓటర్, రేషన్‌ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. రేషన్‌ కార్డు లేకపోతే సర్వే నిర్వహిస్తారు. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే పోర్టల్‌లో సరిచేస్తారు. అసలు, వడ్డీ లెక్కలు సరిపోకపోతే దిద్దుబాటు చర్యలు చేపడతారు’ అని ట్వీట్ చేసింది.

Tags

Next Story