KTR : గోషామహల్ పై కేటీఆర్ దృష్టి

గోషామహల్ నియోజవకర్గంలో అనధికారికంగా కొంత మంది ఇంఛార్జ్ లు చెలామణి అవుతున్న విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( K. T. Rama Rao ) ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎవరిని నియోజకవర్గ ఇంఛార్జ్ పార్టీ ప్రకటించలేదని వెల్లడించారు. త్వరలోనే పార్టీ సరైన వ్యక్తిని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం నంది హిల్స్ లోని కేసీఆర్ నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను గోశామహల్ బీఆర్ఎస్ నేత ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
గోషామహల్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. కొంతమంది లీడర్లు పోయినంత మాత్రాన కార్యకర్తలు ఎవరు అధైర్యపడకుండా ఉండాలని కేటీఆర్ సూచించారు. రానున్న రోజుల్లో తిరిగి పుంజుకుంటామని వెల్లడించారు. తాను ప్రజల మధ్య ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆనంద్ కుమార్ గౌడ్ కేటీ ఆరికి వివరించారు. భజన చేసే వాళ్ళను కాకుండా, పని చేసే వారిని గుర్తించాలని కోరారు.
గతంలో కొన్ని తప్పిదాలు జరిగాయని, ప్రజల్లో ఉంటూ, పార్టీ బలోపేతా నికి పని చేయాలని కేటీఆర్ ఆనంద్ కుమార్ గౌడకు సూచించారు. భవిష్యత్ లో తగిన గుర్తింపు లభిస్తుందని కేటీఆర్ హామీని ఇచ్చినట్లుగా వెల్లడించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com