TG : ఆర్నేళ్లకే అన్నీ అయిపోవు : కూనంనేని సాంబశివరావు

TG : ఆర్నేళ్లకే అన్నీ అయిపోవు : కూనంనేని సాంబశివరావు
X

అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్లుగా కొందరి వ్యవహారి శైలి ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలని చెప్పారు. శనివారం శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భగా ఆయన మాట్లాడారు. ఆర్నెళ్లకే అన్నీ చేయలేదని ప్రభుత్వాన్ని అనడం సరికాదన్నారు. ప్రజలకు మంచి చేయాలనేదే ప్రభుత్వ భావనగా తెలుస్తుందని చెప్పారు. ‘గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయొద్దు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు చేయాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అయితే అప్పులు ఉన్నాయని హామీలు నెరవేర్చకుండా ఉండొద్దు’ అని కూనంనేని అన్నారు.

Tags

Next Story