Lady Aghori Arrested : లేడీ అఘోరీ అరెస్ట్.. మోకిల పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పిందో తెలుసా!

Lady Aghori Arrested : లేడీ అఘోరీ అరెస్ట్.. మోకిల పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పిందో తెలుసా!
X

పూజల పేరిట మోసాలకు పాల్పడిన లేడీ అఘోరిని మోకిలా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. ఇటీవల పూజల పేరుతో తనను లక్షల్లో మోసం చేశాడని ఓ సినీ లేడీ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం కేసు దర్యాప్తులో భాగంగా మాకిలా పోలీసులు లేడీ అఘోరీని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. అఘోరీతో పాటు ఇటీ వల తను వివాహం చేసుకున్న వర్షిణిని కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూర్ మండలానికి చెందిన లేడీ ప్రొడ్యూసర్ లేడీ అఘోరీ శివ విష్ణు బ్రహ్మ అట్లూరి మోసాలపై ఫిర్యాదు చేసింది. ఆరు నెలల కిందట పరిచయమైన లేడీ అఘోరీ 2 నెలల తర్వాత ప్రొద్దటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని తెలిపింది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించడంతో ఆమె మాటలు నమ్మి పూజకు అంగీకరించానని తెలిపింది.

మోకిల పోలీస్ స్టేషన్ లో పోలీస్ విచారణకు హాజరైన సందర్భంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని అఘోరీ అలియాస్ శ్రీనివాస్ చెప్పడం విశేషం. తన భార్య వర్షిణి తనతోనే ఉంటుందని అన్నారు.

Tags

Next Story