Lady Aghori : లేడీ అఘోరీకి రిమాండ్.. లింగ నిర్ధారణ పరీక్షలకు కోర్టు సిఫార్సు

చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీకి రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జైలు అధికారులకు తర్జనభర్జన పడుతున్నారు. అటు ఆడ, ఇటు మగ తేలకుండా ఏ బ్యారక్లోనూ ఉంచలేమంటూ అధికారులు తేల్చి చెప్పారు. అఘోరీని తిరిగి పంపించిన సంగారెడ్డి జైలు అధికారులు.. లింగ నిర్ధారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. మరో వైపు, సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న సమయంలో అఘోరీ అరుపులతో హడావుడి చేశాడు. తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టాడు. ఈక్రమంలో సంగారెడ్డి జైలు అధికారులు లేడీ అఘోరికి లింగ నిర్ధారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని తేల్చిచెబుతున్నారు. చంచల్గూడలో ప్రత్యేక బ్యారక్లు ఉన్నాయని, అక్కడి తరలించే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com