Kadam Project : కడెం గేట్లలో లీకేజీ..వృధాగా పోతున్న నీళ్లు

Kadam Project : కడెం గేట్లలో లీకేజీ..వృధాగా పోతున్న నీళ్లు
X

నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు గేట్ల లీకేజీ తో గోదావరిలోకి నీరు వృథాగా పోతోంది. రెండేళ్లుగా కడెం ప్రాజెక్టుకు మరమ్మతు పనులు చేపట్టక పోవడంతో రైతులు కేవలం ఖరీఫ్ లోనే పంటలు సాగు చేస్తున్నారు. ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

గేట్ల మరమ్మతులకు రూ.9.46 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో గేట్ల మరమ్మతులతోపాటు సీసీ పనులు, విద్యుత్ పనులు చేపట్టారు. నెల రోజుల కిందటే ఈ పనులు పూర్తి చేశారు. గత పది రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా ఇన్ ఫ్లో పెరగడంతో ప్రాజెక్టుకు చెందిన నాలుగు గేట్లు ఎత్తి కిందికు నీరు విడిచిపెట్టారు. మూడు రోజుల నుండి ఇన్ ఫ్లో తగ్గడంతో ఆ గేట్లు దించారు.

అయినప్పటికీ ప్రాజెక్టుకు చెందిన 13, 14,15 నెంబర్ గేట్ల లీకేజీ ద్వారా గోదావరిలోకి నీరు వృథాగా పోతోంది. ఆయకట్టుదారుల ఆందోళన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు కింద నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు చెందిన 68వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుకు రూ.9.46 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టారు. అయినా మూడు గేట్ల ద్వారా నీరు లీకేజీ అవుతూనే ఉంది.

Tags

Next Story