TG : ఆ భూమిని వదిలేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి నటి రేణు దేశాయ్ రిక్వెస్ట్

TG : ఆ భూమిని వదిలేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి నటి రేణు దేశాయ్ రిక్వెస్ట్
X

హెచ్సీయూలోని 400 ఎకరాల భూమికి సంబంధించి వివాదం జరుగుతున్న నేపథ్యంలో నటి రేణు దేశాయ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ భూమిని అలాగే వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. 'నాకు రెండు రోజుల కిందటే దీని గురించి తెలిసింది. అందుకు సంబంధించి కొన్ని విషయాలు కనుక్కున్న. రేవంత్ రెడ్డి.. మీకు ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్న. నాకు ఇప్పుడు 44 ఏండ్లు. రేపో మాపో చనిపోతాను. కానీ నా పిల్లలు అలాగే మన అందరి భవిష్యత్ తరాలకు ఆక్సిజన్, తాగునీరు కావాలి. ఔను మాకు అభివృద్ధి కూడా కావాలి. ఐటీ పార్క్స్, భారీ భవనాలు, వరల్డ్ క్లాస్ సదుపాయాలు కావాలి. కానీ ఈ 400 ఎకరాల ప్రకృతిని, ఫారెస్ట్ ను ధ్వంసం చేయకుండా ఏదైనా అవకాశం ఉంటే వెంటనే ఆపేయండి. మీరు పరిపాలిస్తున్నఈ రాష్ట్ర సిటిజన్ గా అడుగుతున్న. ఏదో ఒకటి చేయండి. మన దగ్గర ఎన్నో ఇతర ల్యాండ్స్ ఉన్నాయి. మీరందరు నాకంటే ఎంతో సీనియర్స్. మీకు నాకంటే ఎంతో అనుభవం ఉంది. ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్న. ఇందులో నా స్వార్థం లేదు. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. గతంలో జరిగిన అభివృద్ధి వల్లనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నం. కానీ ఆ 400 ఎకరాలు దయచేసి వదిలేయండి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా' అని కోరారు.

Tags

Next Story