Leopard : హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుత కదలికలు.. వణికిపోయిన ప్రజలు

X
By - Manikanta |12 July 2025 1:45 PM IST
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మళ్ళీ చిరుత కదలికలు కలకలం రేపాయి. బాలాపూర్ రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ ప్రాంగణంలో చిరుత కదలికలను స్థానికులు గుర్తించారు. దీంతో భయభ్రాంతులకు లోనైన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో రెండు చిరుతల సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. బాలాపూర్ ప్రాంత ప్రజలే కాకుండా ఈ ప్రాంతం గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కాగా గతంలో కూడా చిరుతపులల సంచారంతో నగర ప్రజలు వణికిపోయారు. అప్పుడు అటవి అధికారులు పులులను పట్టుకుని సంరక్షణ కేంద్రానికి తరలించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ మధ్య కాలంలో చిరుతల కదలికలు కనిపించలేదు. మళ్లీ నిన్న రాత్రి బాలాపూర్ శివారు ప్రాంతాల్లో చిరుతలు సంచరించడం కలకలం గా మారింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com