Leopard : మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత తిరిగిందా.. ఇదిగో వాస్తవం

Leopard : మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత తిరిగిందా.. ఇదిగో వాస్తవం
X

హైదరాబాద్‌ మియాపూర్‌లో చిరుత సంచారం వార్త కలకలం రేపింది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు అది పులి కాదు అడవి పిల్లి అని తేల్చారు. నిన్న మియాపూర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన వారు అటవీ శాఖ అధికారులతో కలిసి చిరుత కోసం తీవ్రంగా గాలించారు. ముఖ్యంగా చిరుత పాదముద్రల కోసం అటవీ సిబ్బంది గాలించారు. ఉదయం అపార్ట్‌మెంట్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని అటవీ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. జంతువు కదలికలను బట్టి అది చిరుత కాదని.. అడవి పిల్లి అని తేల్చారు. దీంతో అక్కడున్న స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Next Story