Harish Rao : చేసేది తక్కువ.. లొల్లి ఎక్కువ : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్పు వచ్చిందని.. అన్ని సంక్షేమ పథకాలు ఆగిపో యాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలకుడే మాట తప్పితే.. ప్రజలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ లో పనిచేసేది తక్కువ.. లొల్లి మాత్రం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించి భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్ రావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జరిగిన సభలో హరీశ్ మాట్లాడు తూ 'ఆరు గ్యారెంటీలు అమలు చే స్తామని ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చి అమలు చేశారా? కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. కల్యాణలక్ష్మి కింద ఆరు లక్షల తులాల బంగారం బాకీ పడింది. భద్రాద్రి రాములోరి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ఈ ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్న. ఏడాది పాలనలో ఆత్మ విమర్శలు చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అక్రమంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు పెడితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆరు గ్యారెంటీలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా పనిచేపిస్తం' అని అన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com