CM Revanth Reddy : పాక్‌ను రెండు ముక్కలు చేద్దాం.. సీఎం రేవంత్ కామెంట్స్ పై చర్చ

పాకిస్తాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయాలన్నారు. పీవోకేను భారత్‌లో కలపాలని చెప్పారు. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. 1971లో పాకిస్థాన్‌కు ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారని..ఆనాడు ఇందిరాగాంధీని దుర్గామాతతో వాజ్‌పేయీ పోల్చారి గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి సహా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీఎం అయినా.. సమయోచితంగా స్పందించారని అంటున్నారు జనం. గతంలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ .. తన మార్క్ సరైన టైంలో చూపించారని గుర్తుచేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com