TG : తెలంగాణలో పలుచోట్ల చిరుజల్లుల సూచన

తెలంగాణలో ఇవాళ పలు జిల్లాల్లో వాన కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలకు తావులేదని, తేలికపాటి వాన కురుస్తుందని తెలిపింది. దీనికి తోడు తెలంగాణను చలి చంపేస్తోంది. రానున్న రెండు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు కాస్త జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పడిపోతాయని అధికారులు హెచ్చరించారు. రానున్న 5 రోజులు అక్కడక్కడ ఉదయం వేళ పొగమంచు కురిసే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. రేపు, ఎల్లుండి పొగమంచు ఎక్కువగా ఉంటుందంటున్నారు. రేపు 20-27 డిగ్రీలు, ఎల్లుండి 18-27 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేసారు.
తెలంగాణలో నేడు పలు చోట్ల తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఎలాంటి హెచ్చరికలు లేకపోయినప్పటికీ.. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో గత మూడ్రోజులు వర్షాలు కురిశాయి. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం హైదరాబా్‌లో పొడి వాతావరణం నెలకొని ఉంది. దీనికి తోడు చలి తీవ్రత పెరిగింది. రానున్న రోజుల్లో ఇదే వాతావరణం ఉంటుందని.. చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com