TG : కేటీఆర్‌లా రేవంత్ అమెరికాలో షో చేయడం లేదు

TG : కేటీఆర్‌లా రేవంత్ అమెరికాలో షో చేయడం లేదు
X

పదేళ్ల పాటు పామ్ హౌస్ నుంచి కాలు బయట పెట్టని వ్యక్తికి చెందిన పార్టీ నాయకులు సీఎం విదేశీ పర్యటనపై విషం చిమ్ము తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు తానే ముఖ్యమంత్రి అన్న బిల్డప్ తో కేటీఆర్ విదేశాల్లో షో చేశారని ఎంపీ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కార్ విమర్శించారు. పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ చైనా, సింగపూర్ విహార యాత్రకు మాత్రమే వెళ్లారన్నారు. పెట్టుబడుల కోసం ఏ నాడు కాలు బయట పెట్టలేదని మండిపడ్డారు. ఐటీ మంత్రి హోదాలో కేటీఆర్ విదేశాల్లో జల్సా చేసి వచ్చారని ఆరోపించారు. ఐటీ శాఖకు చెందిన అధికారులు మాత్రమే కేటీఆర్తో విదేశాలకు వెళ్లారన్నారు.

కేటీఆర్ పదేళ్ల కాలంలో విదేశాలకు వెళ్లి తెచ్చిన పెట్టుబడులపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ రావాలన్నారు ఎంపీలు. ఇప్పుడు పెట్టుబడుల కోసం స్వయంగా ముఖ్యమంత్రే అమెరికా వెళ్లారు. రేవంత్ రెడ్డిది అధికారిక పర్యటన, ఎక్కడా రహస్యం లేదు అని వెల్లడించారు. ముఖ్యమంత్రి పేషీకి చెందిన అధికారులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పర్యటనలో ఉన్నారన్నారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాగ్నిజెంట్ లాంటి కంపెనీ సీఈవోతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని, ముఖ్యమంత్రి కృషి కారణంగా హైదరాబాద్కు కాగ్నిజెంట్ కొత్త సెంటర్ రాబోతుందన్నారు. 10 లక్షల చదరపు అడుగుల్లో రాబోయే సెంటర్ వల్ల 15 వేల మందికి కొత్త ఉద్యోగాలు రానున్నాయన్నారు.

Tags

Next Story