TG : లోన్ యాప్ వేధింపులు.. యువకుడి సూసైడ్

TG : లోన్ యాప్ వేధింపులు.. యువకుడి సూసైడ్
X

లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కట్రియాల్ గ్రామంలో జరిగింది. మద్ది గంగాధర్ లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవ డంతో వారి వేధింపులు భరించలేక మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందాడు.

మరోవైపు.. ఆన్లైన్ బెట్టింగ్స్ కు యువకుడు బలి అయ్యాడు. ఆన్లైన్ బెట్టింగులు వేసి అప్పుల పాలవ్వడంతో ఓ యువకుడు ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బడవుతాపురo గ్రామంలో జరిగింది. హనూక్(25) అనే యువకుడికి పబ్జీ గేమ్ ద్వారా ఓ యువకుడు పరి చయమయ్యాడు. అతడి మాటలు నమ్మి ఆన్లైన్ లో బెట్టింగ్ పెట్టి రూ.3లక్షల వరకు పోగొట్టుకున్నాడు. దీంతో హనూక్ తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు.

Tags

Next Story