TG : రుణమాఫీ.. బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి సూచన

TG : రుణమాఫీ.. బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి సూచన
X

రుణమాఫీ డబ్బులు ఇవాళ అకౌంట్లలో జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులను రైతుల ఇతర అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రూ.2లక్షల రుణమాఫీకి మొత్తం రూ.31వేల కోట్లు అవసరం. తొలి విడతలో భాగంగా ఇవాళ రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తుండగా అందుకు రూ.7-8వేల కోట్లు కావాలి. బాండ్ల విక్రయం ద్వారా రూ.4వేల కోట్లు, ఇతర మార్గాల్లో రూ.5వేల కోట్ల నిధులను సర్కార్ సేకరించింది. ఇక రెండు, మూడు విడతల్లో రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించే పనిలో ప్రభుత్వం ఉంది. రూ.లక్షలోపు రైతు రుణాలను ప్రభుత్వం ఇవాళ మాఫీ చేయనుంది. దీంతో ఆపై లోన్ ఉన్న ఉన్నవాళ్లకు ఎప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈనెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న లోన్లను ఆగస్టు 15లోపు మాఫీ చేయనున్నట్లు సీఎం తెలిపారు.

Tags

Next Story