TG : తెల్ల కార్డు లేని రైతులకు రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల

TG : తెల్ల కార్డు లేని రైతులకు రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల
X

రాష్ట్రంలో తెల్ల కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో భాగస్వామ్యం అయ్యారని చెప్పారు. పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 31 వేల కోట్ల రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని తెలిపారు. ముందుగా రూ. 2 లక్షల వరకే రుణమాఫీ ఇవ్వాలని అనుకున్నామని అన్నారు. రూ.2 లక్షలు పైన ఉన్న రైతులకు కూడా ఇవ్వాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతులు మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేశామని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా తెలంగాణలో కోటీ 50 లక్షల మెట్రిక్ టన్నుల వరిని రైతులు పండిస్తున్నారని వెల్లడించారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని మాటిచ్చారు. ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుందని తెలిపారు. 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, తమ ప్రభుత్వం అప్పులు తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేసిందని తెలిపారు.

Tags

Next Story