Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా: అక్టోబర్ 9న నోటిఫికేషన్...

Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా: అక్టోబర్ 9న నోటిఫికేషన్...
X

దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు తీపి కబురు చెప్పింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇవాళ పూర్తి వివరాలను ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక తేదీలను వెల్లడించారు.

కాగా స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల కానుంది. నెల రోజుల పాటు అంటే నవంబర్ 9న ఈ ప్రక్రియ ముగియనుంది. అయితే ఇప్పటి నుండే ఎలక్షన్ కోడ్ అమలు లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు.

అక్టోబర్ 23, 27 తేదీల్లో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల తుది ఫలితాలను నవంబర్ 11న వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు.

ఇక పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 తేదీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రమే సర్పంచ్ ఫలితాలు వెల్లడిస్తారు.

Tags

Next Story