LOCAL WAR: రెండో దశలోనూ హస్తం హవా

LOCAL WAR: రెండో దశలోనూ హస్తం హవా
X
కాంగ్రెస్‌కు సగానికిపైగా సీట్లు... బీఆర్‌ఎస్‌కు 25 శాతానికి పైగా సీట్లు... సిద్దిపేటలో టాప్‌ గేరులో ‘కారు’

పం­చా­య­తీ ఎన్ని­క­ల్లో అధి­కార కాం­గ్రె­స్‌ పా­ర్టీ హవా కొ­న­సా­గు­తోం­ది. తొలి వి­డ­త­లో మె­జా­రి­టీ స్థా­నా­ల­ను కై­వ­సం చే­సు­కు­న్న హస్తం పా­ర్టీ.. మలి వి­డ­త­లో­నూ అదే జోరు కొ­న­సా­గిం­చిం­ది. ఆది­వా­రం జరి­గిన రెం­డో విడత ఎన్ని­క­ల్లో కూడా కాం­గ్రె­స్‌ పా­ర్టీ బల­ప­రి­చిన అభ్య­ర్థు­లే అత్య­ధిక స్థా­నా­ల్లో వి­జ­య­బా­వు­టా ఎగు­ర­వే­శా­రు. మలి వి­డ­త­లో 192 మం­డ­లాల పరి­ధి­లో­ని 3911 గ్రా­మ­పం­చా­య­తీ­ల­కు ఎన్ని­క­లు జర­గ్గా.. 2200కు పైగా స్థా­నా­ల్లో కాం­గ్రె­స్‌ అభ్య­ర్థు­లు గె­లు­పొం­దా­రు. మె­జా­రి­టీ సీ­ట్ల­ను సా­ధిం­చ­డం ద్వా­రా గ్రా­మీణ ప్రాం­తా­ల్లో అధి­కార పా­ర్టీ తన పట్టు­ను ని­లు­పు­కు­న్న­ట్ల­యిం­ది. మరో­వై­పు ప్ర­తి­ప­క్ష బీ­ఆ­ర్‌­ఎ­స్‌ పా­ర్టీ­కి కూడా మలి విడత ఫలి­తా­లు కా­స్త ఊర­ట­ని­చ్చా­యి. 1100కు (25 శా­తా­ని­కి) పైగా సీ­ట్ల­ను గె­లు­చు­కో­వ­డం ద్వా­రా గ్రా­మా­ల్లో తన ఉని­కి­ని చా­టు­కుం­ది. మరో ప్ర­ధాన ప్ర­తి­ప­క్షం బీ­జే­పీ­కి తొలి వి­డ­త­తో పో­లి­స్తే స్వ­ల్పం­గా సీ­ట్లు పె­రి­గా­యి. కమ్యూ­ని­స్టు­లు, ఇతర పా­ర్టీ­లూ పది శా­తా­ని­కి పైగా సీ­ట్ల­ను కై­వ­సం చే­సు­కు­న్నా­యి. మలి వి­డ­త­లో మొ­త్తం 4332 సర్పం­చ్‌ స్థా­నా­ల­కు ఎన్ని­క­లు జర­గా­ల్సి ఉంది. అయి­తే వీ­టి­లో 415 స్థా­నా­లు ఏక­గ్రీ­వం కాగా.. ఐదు గ్రా­మా­ల్లో నా­మి­నే­ష­న్లు దా­ఖ­లు కా­లే­దు. మి­గి­లిన 3,911 గ్రామ పం­చా­య­తీ­ల­కు ఎన్ని­క­లు జరి­గా­యి. కాగా, రెం­డో వి­డ­త­లో గె­లి­చిన స్వ­తం­త్ర అభ్య­ర్థు­ల్లో ఎక్కువ మంది కాం­గ్రె­స్‌ రె­బ­ల్సే ఉం­డ­డం గమ­నా­ర్హం.

రెం­డో విడత సర్పం­చ్‌ ఎన్ని­క­ల్లో­నూ బీ­ఆ­ర్‌­ఎ­స్‌ పా­ర్టీ వె­న­కం­జ­లో­నే ఉంది. అయి­తే ఈ ఎన్ని­క­ల్లో 25 శా­తా­ని­కి పైగా సీ­ట్ల­ను కై­వ­సం చే­సు­కో­వ­డం ఊరట కలి­గిం­చే అం­శ­మే­న­ని పా­ర్టీ వర్గా­లు చె­బు­తు­న్నా­యి. తొలి, రెం­డో విడత సర్పం­చ్‌ ఎన్ని­క­ల్లో 25 శా­తా­ని­కి పైగా సీ­ట్లు కై­వ­సం చే­సు­కో­వ­డం ద్వా­రా క్షే­త్ర­స్థా­యి­లో ఆ పా­ర్టీ తన ఉని­కి­ని చా­టు­కుం­ద­ని, ప్ర­స్తుత పరి­స్థి­తు­ల్లో ఇది బీ­ఆ­ర్‌­ఎ్‌­స­కు పె­ద్ద ఊర­టే­న­ని వి­శ్లే­ష­కు­లు చె­బు­తు­న్నా­రు. మలి వి­డ­త­లో కడ­ప­టి వా­ర్త­లు అం­దే­స­రి­కి బీ­ఆ­ర్‌­ఎ­స్‌ పా­ర్టీ మద్ద­తు ఇచ్చిన అభ్య­ర్థు­లు 1195 సీ­ట్లు గె­లు­చు­కు­న్నా­రు. మలి వి­డ­త­లో­నూ కే­సీ­ఆ­ర్‌, హరీ­శ్‌­లు ప్రా­తి­ని­ధ్యం వహి­స్తు­న్న సి­ద్ది­పే­ట­లో బీ­ఆ­ర్‌­ఎ­స్‌ హవా కొ­న­సా­గిం­ది. ఈ జి­ల్లా­లో మలి వి­డ­త­లో 186 గ్రామ పం­చా­య­తీ­ల­కు ఎన్ని­క­లు జర­గ్గా వం­ద­కు పైగా సీ­ట్ల­లో బీ­ఆ­ర్‌­ఎ­స్‌ బల­ప­రి­చిన అభ్య­ర్థు­లే గె­లి­చా­రు. ఇత­రు­లు 36, కాం­గ్రె­స్‌ పా­ర్టీ కే­వ­లం 26 సీ­ట్ల­లో వి­జ­యం సా­ధిం­చా­యి. హరీ­శ్‌ ని­యో­జ­క­వ­ర్గం­లో­ని 91 పం­చా­య­తీ­ల్లో 78 బీ­ఆ­ర్‌­ఎ­స్‌ గె­లు­చు­కో­వ­డం వి­శే­షం. ఇక్కడ కాం­గ్రె­స్‌ 5 స్థా­నా­ల­కే పరి­మి­త­మైం­ది. జన­గామ జి­ల్లా­లో కాం­గ్రె­స్‌ 30 సర్పం­చ్‌ సీ­ట్లు గె­లు­చు­కుం­టే.. బీ­ఆ­ర్‌­ఎ­స్‌ 37 సీ­ట్లు సొం­తం చే­సు­కుం­ది. ఆసి­ఫా­బా­ద్‌ జి­ల్లా­లో కాం­గ్రె­స్‌­కు 24, బీ­ఆ­ర్‌­ఎ్‌­స­కు 40 సీ­ట్లు వచ్చా­యి. మలి వి­డ­త­లో మొ­త్తం 4332 సర్పం­చ్‌ సీ­ట్ల­కు గాను కడ­ప­టి వా­ర్త­లు అం­దే­స­రి­కి కాం­గ్రె­స్‌ పా­ర్టీ మద్ద­తు ఇచ్చిన అభ్య­ర్థు­లు 2331స్థా­నా­ల­ను గె­లు­చు­కు­న్నా­రు. మరో­వై­పు జి­ల్లాల వా­రీ­గా­నూ ఈ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్‌ పా­ర్టీ హవా కొ­న­సా­గిం­ది.

పంచాయతీ పోరులో విషాదాలు

పం­చా­య­తీ ఎన్ని­క­లు కొ­న్ని కు­టుం­బా­ల­కు వి­షా­దా­న్ని మి­గి­ల్చా­యి. ఓ అభ్య­ర్థి పో­లిం­గ్‌ రో­జున హఠా­త్తు­గా మర­ణిం­చ­గా, మరో చోట ఎన్ని­కల బరి­లో ని­లి­చిన తన కూ­తు­రి­కి ఓటే­సిన కా­సే­ప­టి­కే తం­డ్రి చని­పో­యా­డు. ఖమ్మం జి­ల్లా నే­ల­కొం­డ­ప­ల్లి మం­డ­లం అనా­సా­గ­రం గ్రా­మా­ని­కి చెం­దిన దా­మాల నా­గ­రా­జు (40) సర్పం­చ్‌ స్థా­నా­ని­కి స్వ­తం­త్ర అభ్య­ర్థి­గా పోటీ చే­శా­రు. ఎన్ని­కల నే­ప­థ్యం­లో నా­గ­రా­జు కొ­ద్ది­రో­జు­లు­గా తీ­వ్ర ఒత్తి­డి­లో ఉన్న­ట్టు సమా­చా­రం. ఈ క్ర­మం­లో నా­గ­రా­జు ఆది­వా­రం ఉదయం బ్రె­యి­న్‌ డె­డ్‌­కు గురై మర­ణిం­చా­రు. ఆది­వా­రం జరి­గిన పో­లిం­గ్‌­లో నా­గ­రా­జు­కు 16 ఓట్లు వచ్చా­యి. ఇక, రం­గా­రె­డ్డి జి­ల్లా చే­వె­ళ్ల మం­డ­లం ఆలూ­ర్‌ గ్రామ పం­చా­య­తీ అను­బంధ గ్రా­మం వెం­క­న్న­గూడ గ్రా­మా­ని­కి చెం­దిన పో­లి­సేట బు­చ్చ­య్య(70) కు­మా­ర్తె రా­ము­ల­మ్మ ఆలూ­రు పం­చా­య­తీ 14వ వా­ర్డు సభ్యు­రా­లి­గా పోటీ చే­శా­రు. ఆది­వా­రం జరి­గిన పో­లిం­గ్‌­లో భా­గం­గా ఓటే­సిన బు­చ్చ­య్య పో­లిం­గ్‌ కేం­ద్రం­లో నుం­చి బయ­టి­కి వస్తుం­డ­గా మూ­ర్ఛ వచ్చి ఆ ఆవ­ర­ణ­లో­నే కు­ప్ప­కూ­లి­పో­యా­డు.

Tags

Next Story