TG : వావర్ దర్గాకు అయ్యప్ప స్వాములు వెళ్లొద్దు..రాజాసింగ్ సంచలన ప్రకటన

X
By - Manikanta |22 Nov 2024 5:45 PM IST
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయానికి వెళ్లే భక్తులకు కీలక సూచనలు చేశారు. శబరిమల ఆలయానికి వెళ్లే స్వాములు.. వావర్ స్వామి దర్గాకు వెళ్లకూడదని సూచించారు. మనం అలా వెళ్లడం పాపం అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. శబరిమలకు సమీపంలో ఉన్న వావర్ దర్గాను అయ్యప్ప స్వామి భక్తులు దర్శించడం ఆనవాయితీ వాస్తోంది. అయ్యప్పకు వావర్ సన్నిహితుడన్న ప్రచారం ఉంది. అయితే తాజాగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చరిత్రపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com