Lorry Accident : మియాపూర్లో లారీ బీభత్సం.. హోంగార్డు మృతి

మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. డ్యూటీల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్ల పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రీట్మెంట్ పొందుతూ సింహాచలం అనే హోంగార్డు మృతి చెందగా...మరో ఇద్దరు రాజవర్ధన్ , విజేందర్ తీవ్రంగా గాయపడ్డారు. నిన్న రాత్రి కానిస్టేబుళ్లు మియాపూర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 600వద్ద నో ఎంట్రీ వెహికల్ ను కంట్రోల్చేస్తున్నా రు. అదే టైంలో కూకట్ పల్లి భరత్ నగర్ లో బియ్యం బస్తాలను అన్లోడ్ చేసిన లారీ.. మియాపూర్ వైపు యూ టర్మ్ తీసుకుంటుండగా ఓవర్సీస్పీడ్ తో వచ్చి ట్రాఫిక్ బూతు ఢీకొట్టింది. దీంతో అది అక్కడే డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్స్ పై పడింది. గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుల్స్ మదీనాగూడలోని ప్రైవేటు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవ ర్ను సదాశివపేటకు చెందిన శ్రీనివాస్ గా గుర్తిం చారు. నిర్లక్ష్యం, అతి అతివేగం వల్లే ప్రమాదం జరిగిన్నట్లు తెలుస్తోంది. మృతుడు సింహాచలం స్వస్థలం ఏపీ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com