Suryapet: ప్రియుడి ఇంటిముందు మౌనపోరాటం

Suryapet: ప్రియుడి ఇంటిముందు మౌనపోరాటం

మూడేళ్లుగా ప్రేమించాడు. నువ్వే ప్రాణమని నమ్మించాడు. అతడే సర్వస్వం నమ్మిన ఆ ప్రియురాలు.. మనసు, తనువు ఇచ్చేసింది. ఆ తర్వాత మోజు తీరాక కాదని మొఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమంటే కుటుంబంతో సహా పత్తా లేకుండా పారిపోయాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు మౌనపోరాటానికి దిగింది. ప్రియుడి చేతిలో మోసపోయిన ప్రియురాలి ఘటన సూర్యపేటలో జరిగింది. ప్రియుడు పెండెం శివతేజ ఇంటి ముందు బాధితురాలు రమ్య ఆందోళన చేపట్టారు. మూడేళ్లుగా ప్రేమించి శివతేజ మోసం చేశాడని రమ్య ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లో డాక్టర్ చదివే సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నామని చెప్తున్నారు. అయితే ఇటీవలే అర్హత పరీక్ష ఉత్తీర్ణత కావడంతో.. అధిక కట్నం ఆశతో మొఖం చాటేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని రమ్య డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story