Lovers suicide: రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

Lovers suicide:  రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య
X
Lovers suicide: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట రైల్వేగేట్ సమీపంలో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట రైల్వేగేట్ సమీపంలో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు భువనగిరి మండలం బస్వాపూర్‌కు చెందిన గణేష్‌, నలందగా గుర్తించారు. అయితే.. నలందకి మూడేళ్ల క్రితం వివాహం అయింది.

నలంద భర్త యాదగిరిగుట్టపై ఉద్యోగి. మంగళవారం రాత్రి డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చి చూసే సరికి భార్య కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపు చేపట్టిన పోలీసులు బాహుపేట రైలు పట్టాలపై మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించారు. ట్రైన్‌ కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

Tags

Next Story