Madhu Yashki Goud : మీ ఇళ్లు ఎవరూ కూల్చరు... మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
అధికారులూ జాగ్రత్త.. అత్యుత్సాహం ప్రదర్శించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. అధికారులు మార్క్ చేసినంత మాత్రాన పేదల ఇండ్లు కూల్చలేరు అని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని చైతన్యపురి, కొత్తపేట మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఆయన భరోసా కల్పించారు. మీ ఇంటిపై గడ్డపార పడదు.. మీ ఇంటిపైకి ప్రొక్లైన్ రాకుండా చూసుకుంటానని మూసీ బాధితులకు హామీ ఇచ్చారు. అధికారులు తమ ఆవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. అక్రమార్కులైన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మూసీ నదికి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ణయించేందుకు అధికారుల దగ్గర ఒక ప్రతిపాదిక లేదని స్పష్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండా, ప్రజల అంగీకారం లేకుండా ఏ ఇల్లు కూల్చకూడదని తెలిపారు. నదికి ఇండ్లు ఉన్న వైపు కాకుండా పొలాలు ఉన్న వైపు ఎక్కువ స్థలాన్ని సేకరించి కూడా సుందరీకరణ చేయొచ్చని సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com