Mahabubabad: విషాదం.. కారు అదుపుతప్పి బావిలో పడడంతో నలుగురు మృతి

Mahaboobnagar: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడటంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కే.సముద్రంలో చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ దర్గా వద్ద ప్రార్ధనలు చేసుకుని.. బంధువుల ఫంక్షన్‌కు హాజరై తిరిగి వెళ్తున్నారు కొత్తగూడెం జిల్లా గోలియా తండాకి చెందిన గ్రామస్తులు. అయితే.. అదే ఫంక్షన్‌కు హాజరైన మరో ఇద్దరు మహబూబాబాద్ వరకు లిఫ్ట్ ఇవ్వాలని కోరారు. అదే వాళ్ల పాలిట యమపాశంలా మారింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. వేగంగా కారు నడపడంతో కే.సముద్రం వద్ద వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.
స్పాట్‌లోనే నలుగురు చనిపోయారు. గమనించిన వివేకానంద స్కూల్ విద్యార్థులు రంజిత్, సిద్ధు ప్రాణాలకు తెగించి ముగ్గురిని కాపాడారు. కారు అద్దాలు పగులగొట్టి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. ఆ విద్యార్థులను స్థానికులు అభినందించారు. లలితా, సురేష్, భద్రు, అచ్చాలి మృతదేహాలు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com