8 July 2022 7:45 AM GMT

Home
 / 
తెలంగాణ / Telangana: వరదనీటిలో...

Telangana: వరదనీటిలో మునిగిన స్కూల్ బస్సు.. భయంతో విద్యార్థుల కేకలు..!

Telangana: మహబూబ్‎నగర్ జిల్లాలో ఓ స్కూల్ బస్సు వరదనీటిలో చిక్కుకుంది. అందులోని విద్యార్ధులు భయంతో కేకలు పెట్టారు.

Telangana: వరదనీటిలో మునిగిన స్కూల్ బస్సు.. భయంతో విద్యార్థుల కేకలు..!
X

మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్‌ విద్యార్థులకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మచన్‌పల్లి-కోడూరు మార్గంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద వరదనీరు భారీగా వచ్చి చేరింది. ఈ క్రమంలో రామచంద్రపురం నుంచి సుగురు తండాకు స్కూలు బస్సు వెళ్తుండగా.. రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద వరదనీటిలో చిక్కుకుంది. దాదాపు సగభాగం వరదలో బస్సు మునిగిపోవడంతో అందులోని విద్యార్థులు ఆర్తనాదాలు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు.. విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం బస్సును ట్రాక్టర్‌ సాయంతో బయటకు తీశారు.
Next Story