TG : ఈటల నీ కులం ఏంటో చెప్పు : మహేష్ కుమార్ గౌడ్

TG : ఈటల నీ కులం ఏంటో చెప్పు : మహేష్ కుమార్ గౌడ్
X

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడంపై పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్అయ్యారు. కేసీఆర్ అలీబాబా 420 టీంలో ఆయన ఒక మెంబరే అని ఆరోపించారు.ఈటల కులం ఏంటో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీలో పదవులు రాలేదని తమపై అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 'బీజేపీలో ఈటల ఇమడ లేకపోతున్నారు. ఆయన పదవిని కిషన్ రెడ్డి అడ్డుకుంటుండు. దీంతో ఆక్రోశంతో సీఎంపై మాట్లాడ్తున్నారు. దేవాదాయ భూములు కబ్జా చేసింది నువ్వు కదా? ప్రభుత్వం ఎందుకు పడి పోతుంది. కేసీఆర్ వైపు ఈటల చూస్తున్నట్టుఉంది ఆయన మాటలు చూస్తుంటే.. సీనియర్ నాయకుడివి. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏం నేర్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడుతుంది కిషన్ రెడ్డి, ఈటల కాదా? మీ విషం చిమ్మడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. బీసీ బిల్లును కేంద్రం ముందు తీసుకొని వెళ్లడం లేదు. సద్విమర్శ చేయండి. ప్రభుత్వం తప్పులు చేస్తే చెప్పండి వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈటల జాగ్రతగా మాట్లాడాలి' వార్నింగ్ ఇచ్చారు.

Tags

Next Story