Group-1 : గ్రూప్-1లో డీఎస్పీ కొలువు సాధించిన మహేశ్వరికి సన్మానం

Group-1 : గ్రూప్-1లో డీఎస్పీ కొలువు సాధించిన మహేశ్వరికి సన్మానం
X

కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మోదుంపల్లి మహేశ్వరి D.S.P.గా నియామక ఉత్తర్వులు అందుకుని స్వస్థలానికి చేరుకోవడంతో గ్రామస్థులు...ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీచేపట్టి సన్మానం చేశారు. స్థానిక అంబేడ్కర్, జగ్జీవన్ రాం విగ్రహాలకు పూలమాల వేసి మహేశ్వరి నివాళులర్పించారు. తర్వాత ఓపెన్ టాప్ జీపులో ఆమెను స్థానికులు ఊరేగించారు. అనంతరం తూర్పు దర్వాజ వద్ద గ్రామస్థులు, జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం, అంబేడ్కర్ సంఘం నాయకులు సన్మానం చేశారు. కడు పేదరికాన్ని జయించి మహేశ్వరి ఉన్నత స్థానానికి ఎదిగిందని స్థానికులు ప్రశంసించారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే కొలువు సాధించిందని మహేశ్వరీ తెలిపారు.

Tags

Next Story