Mainampally Hanmantha Rao : నాకు అడ్డుపడే లీడర్లను బుల్డోజర్ తో తొక్కిస్తా

నాకు అడ్డుపడే లీడర్లను బుల్డోజర్ తో తొక్కించుకుంటూ ముందుకు వెళ్తానని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వార్నింగ్ ఇచ్చారు. మైనంపల్లి అంటేనే ధైర్యమని, ప్రాణం పోయేంత వరకు వెనుకడుగు వేయనని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ భూంపల్లి మండలం కూడవెళ్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో యన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారిన కొంత మంది నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే పట్టించుకోనన్నారు. చక్రధర్ గౌడ్, కేటీఆర్, హరీశ్ రావు చేతిలో కీలుబొమ్మగా మారాడన్నారు. ఆయన తనకు గుర్తింపు రావాడానికి తనలాంటి వారిపై విమర్శలు చేస్తున్నాడని, అటువంటి వాటిని తాను పట్టించుకోనన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకుల చిట్టా త్వరలోనే విప్పుతానన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకుల కంటిపై కునుకు లేకుండా చేస్తానన్నారు. బీఆర్ ఎస్ నాయకులు చిట్టాను తాను విప్పుతుండడంతోనే చక్రధర్ గౌడ్ లాంటి కొంతమంది నాయకులకు డబ్బులిచ్చి తనపై విమర్శలు చేయిస్తున్నారని పే ర్కొన్నారు. తనకు ఎలాంటి వ్యసనాలు లేవని, వ్య సనాలు ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే భయం ఉంటుందన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com