KTR : ఈ-ఫార్ములా కేసులో కేటీఆర్ కు బిగ్ షాక్.. ఏం జరగబోతోంది..?

KTR : ఈ-ఫార్ములా కేసులో కేటీఆర్ కు బిగ్ షాక్.. ఏం జరగబోతోంది..?
X

తెలంగాణాలో మరో హాట్ టాపిక్‌ తెరమీదకు వచ్చింది. ఫార్ములా E కార్ రేసింగ్‌ కేసులో బీఆర్ ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు పెద్ద షాక్ తగిలింది. కేటీఆర్ ను ACB విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు. ఈ కార్ రేసులో రూ.54.88 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి యూకే-ఆధారిత Formula E Operations Limited సంస్థకు చెల్లింపులు జరిగినప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్‌ ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా.. ప్రొసీజర్లు పాటించకుండా మొత్తం పనిచేశారనే ఆరోపణ ఉంది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ను ఏసీబీ విచారించింది.

ఈ అవకతవకల్లో కేటీఆర్ పాత్ర ఉందని ఏసీబీ గవర్నర్ కు లేఖ రాయగా.. ఆయన ప్రాసిక్యూషన్ కు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఏసీబీ త్వరలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. కేటీఆర్ చెబితేనే నిధులు విడుదల చేశామని అరవింద్ చెప్పారు. దీంతో ఇందులో కేటీఆర్ ప్రధాన పాత్ర పోషించారంటూ ఏసీబీ చెబుతోంది. మొత్తం రూ.55 కోట్ల నిధులు హెచ్ ఎండీఏ నిధుల నుంచే చెల్లించారు. అందుకే ఇందులో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వడంతో తర్వాత ఏం జరుగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ తప్పదా అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు జరగబోయే విచారణ ఇంకో ఎత్తు అంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఏసీబీ విచారణ ఎదుర్కున్న కేటీఆర్.. తాను ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదని.. బిల్లు చెల్లింపులు అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయంటున్నారు కేటీఆర్. అదే విషయాన్ని ఏసీబీ విచారణలో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు జరగబోయే విచారణలో ఏసీబీ చాలా సీరియస్ ప్రశ్నలు వేసే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది.

Tags

Next Story