Telangana : 25 తర్వాత భారీగా బదిలీలు!

Telangana : 25 తర్వాత భారీగా బదిలీలు!
X

తెలంగాణ ప్రభు గడిచిన ఏడాదిన్నర కాలంగా వివిధ కోణాల్లో మార్పులు, చేర్పులతో సుస్థిర పాలన దిశగా రేవంత్ సర్కారు అడుగులు వేస్తోందని కాంగ్రెస్ నేతలు అన్నారు. తన మంత్రిమండలి సహచరుల ఆలోచనలకు అనుగుణంగా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 తర్వాత భారీ బదిలీలు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ముందుగా కీలక శాఖల్లో మార్పులు చేసి, ఆ తర్వాత కిందిస్థాయిలో దాదాపు 90శాతం ఉద్యోగుల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా స్థానచలనం కల్పించాలని యోచిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపత్యంలో పరిపాలనా సౌలభ్యం దిశగా దిశగా, అదే సమయంలో సంస్థాగతంగా మార్పుల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం సూచనల మేరకు లిస్ట్ ఔట్ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం అందించినట్లు సచివాలయ వర్గాల ద్వారా సమాచారం అందింది. బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నెలాఖరుతో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ నియామకంపై కూడా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

Tags

Next Story