GHMC : జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అధికారుల బదిలీలు...

GHMC : జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అధికారుల బదిలీలు...
X

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ లో భారీ స్థాయిలో అధికారులను బదిలీ చేశారు. పలువురికి ప్రమోషన్ లతో పాటు కొత్త పోస్టింగులు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 23 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేసింది ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్న హైదరాబాద్ నగరాన్ని మరింత సుందరంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు గా తెలుస్తోంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్జన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖైరతాబాద్ సర్కిల్ కు గాను జయంత్ను డిప్యూటీ కమిషనర్ నియమించగా, యూసఫ్గూడ సర్కిల్లో రజనీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్కాజ్గరి డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా, చందానగర్కు శశిరేఖ, ఉప్పల్కు రాజులను నియమించారు. ఇక సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, గోషామహలు ఉమాప్రకాష్, రాజేంద్రనగర్కు రవికుమార్, ఎల్బీ నగర్కు మల్లికార్జున రావు, హయత్నగర్ సర్కిల్కు గాను వంశీకృష్ణ బాధ్యతలు చేపడతారు. మూసాపేట్ డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్, బేగంపేట్కు డాకు నాయక్ లు డిప్యూటీ కమిషనర్గా నిమమితులయ్యారు.

Tags

Next Story