TG : మల్లన్న సాగర్ నీళ్ల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామాకైనా రెడీ!

మల్లన్న సాగర్ సాగు నీళ్లను దుబ్బాకకు ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీ నామాకైనా తాను సిద్దమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి లో ఇర్కోడ్ లిఫ్ట్ ఇరి గేషన్ జలసాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్ల కోసం మరో ఉద్యమం సిద్దమవుతామన్నారు. హైదరాబాద్ కు వెళ్లే మల్లన్న సాగర్ జలాలను అడ్డుకుంటామన్నారు. కేసిఆర్ హయాంలో తాము ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువలు కూడా నిర్మించడం లేదన్నారు. 'ఏడాదిన్నర కాలంగా కాలువలు నిర్మించి నీళ్లు అందించాలని కోరుతున్నాం. ప్రభుత్వం పట్టించుకో వడం లేదు. ఇర్కోడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వడం తో పాటు, మా దగ్గర వెంటనే కాలువలు పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గ రై తంగానికి నీళ్లు ఇవ్వాలి తెలంగాణ ఉద్యమం తరహా మరో ఉద్యమం చేపట్టుతాం' అని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com