TG : ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తి అరెస్ట్

బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఢిల్లీకి చెందిన అక్రమ్‌గా గుర్తించారు. నిందితుడిని వెస్ట్ జోన్ డీసీపీ, జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 56లోని ఎంపీ అరుణ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. రెండు చేతులకు గ్లౌజ్‌లు, ముఖానికి మాస్కు ధరించాడు. ఇంట్లోని కిచెన్, హాల్ పరిసర ప్రాంతాలన్నీ కలియతిరిగాడు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, కిచెన్ విండో తొలగించి ఆగంతకుడు లోనికి ప్రవేశించాడు. గంటకుపైగా ఇంట్లో కలియతిరిగాడు. దీంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే డీకే అరుణకు ఈ విషయాన్ని చెప్పారు. అప్రమత్తమై ఎంపీ విషయాన్ని సిబ్బందికి తెలియజేయగా.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనతో తన భద్రతపై డీకే అరుణ అనుమానాలు వ్యక్తం చేశారు. అటు సీఎం రేవంత్‌రెడ్డి సైతం డీకే అరుణతో ఫోన్‌లో మాట్లాడి .. భద్రత కలిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com