Manda Krishna : మందకృష్ణ మాదిగ అరెస్ట్

Manda Krishna : మందకృష్ణ మాదిగ అరెస్ట్
X

ఎస్సీ వర్గీకరణ కోసం ఇందిరా పార్క్ వద్దకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరరణ పూర్తి చేయకుండానే ప్రభుత్వ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంఆర్‌పీఎస్ నేతలు ధర్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పార్శీగుట్ట లో ఎమ్మార్పీఎస్ భవనం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు శ్రేణులతో కలిసి బయలు దేరిన మందకృష్ణ మాదిగను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేసి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించగా ఎమ్మార్పీఎస్ శ్రేణులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Tags

Next Story