Rajanna Sircilla: రాజన్న సిరిసిల్లలో విషాదం.. దాదాపు 100 ఆవులు మృత్యువాత..

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్లా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం, మద్దిమల్ల తండా శివారులో ఎక్కడికక్కడ ఆవులు మృతిచెందడం కలకలం రేపింది. దీంతో ఆవులు పెంపకం దారులు, రైతులు బోరున విలపిస్తున్నారు. మద్దమల్ల తండా గ్రామంలో ప్రతి ఇంటికి పదుల సంఖ్యలో ఆవులు ఉంటాయి. ఎప్పటిలాగే అడవిలోకి ఆవులను మేతకు తీసుకెళ్లగా.. వర్షం ఎక్కువ కావడంతో కాపరులు ఇంటికి వచ్చారు.
అయితే భారీ వర్షం కారణంగా ఆవులు, వాటి దూడలు వర్షంలో తడిసి కొన్ని, మరికొన్ని నీటి గుంటల్లో పడి, కొన్ని నీటిప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాయి. బ్రతికి ఉన్న ఆవుల ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించిందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు.. గ్రామస్తులతో కలిసి అడవుల్లోకి వెళ్లి వాటిని పరిశీలించారు. ఇప్పటివరకు 50 ఆవుల కళేబరాలను గుర్తించారు. కనిపించకుండా పోయిన మరో 50 ఆవులను గుర్తించే పనిలో పడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com