TG : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీ అవినీతి : కాగ్

TG : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీ అవినీతి : కాగ్
X

ఎక్సైజ్ శాఖలో భారీ అవినీతి జరిగినట్టు కాగ్ వెల్లడించింది. ఎక్సైజ్‌శాఖకు పన్ను చెల్లింపు విషయంలో రూ.77 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ తన నివేదికలో తెలిపింది. అవకతవకలు అన్నీ 2017-22మధ్య జరిగినట్లు తనిఖీల్లో గుర్తించామని చెప్పింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పని తీరుపై మండిపడింది. 179కేసులకు సంబంధించి పన్నులు తక్కువ చెల్లించడం, ఆలస్యంగా చెల్లించినా ఫైన్ వసూలు చేయలేదని చెప్పింది. అసలు పన్నులే చెల్లించని వారిపై సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. దీనిపై ఇప్పటికే గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని.. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. రాష్ట్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఎక్సైజ్ శాఖ 11కేసుల్లో రూ.11లక్షలు వసూలు చేసినట్లు కాగ్ తెలిపింది.

Tags

Next Story