Sajjanar : తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు: హైదరాబాద్ సీపీగా సజ్జనార్

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలన వ్యవహారాల్లో కీలకంగా ఉండే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు. మొత్తం ఆరుగురు ఐఏఎస్ అధికారులతో పాటు, 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
కాగా ఈ బదిలీ లలో ప్రధానంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నియామకం ఉంది. ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న సిపి సజ్జనార్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, హోమ్ శాఖ సెక్రటరీగా సీవీ ఆనంద్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డీజీగా రవిగుప్తా, ట్రాన్స్పోర్టు కమిషనర్ గా రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రిజ్వీకి బాధ్యతలు అప్పగించారు.
ఈ బదిలీల్లో పలువురు సీనియర్ మహిళా అధికారులు సహా ముఖ్యమైన పోస్టుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా హరిత, స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ ఝా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ మరియు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా శిఖా గోయల్, ఏసీబీ డీజీగా చారుసిన్హా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతి లక్రాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇక పోలీస్ శాఖలో మల్టీజోన్-2 ఐజీగా డీఎస్ చౌహాన్, గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్, హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్, వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్, నారాయణ పేట్ ఎస్పీగా వినీత్ లు నియమితులు అయ్యారు. వీరితో పాటు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా సింధు శర్మ, రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్, మాదాపూర్ డీసీపీగా రీతిరాజ్, ఎస్బీ నగర్ డీసీపీగా అనురాధ ట్రాన్స్ ఫర్ అయ్యారు.
Tags
- Sajjanar
- Telangana
- IAS
- IPS
- Chief Secretary Rama Krishna Rao
- Hyderabad Police Commissioner
- RTC MD
- CP Sajjanar
- Vijay Kumar
- Intelligence Chief
- CV Anand
- Home Secretary
- Ravigupta
- Centre for Good Governance
- Raghunandan Rao
- Transport Commissioner
- Surendra Mohan
- Agriculture Secretary
- Rizvi
- GAD Political Secretary
- Latest Telugu News
- Telangana News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com