Medaram Maha Jatara : మేడారం మహా జాతర తేదీలు ఖరారు!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు జాతర జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది. మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026 మహాజాతరకు వచ్చే భక్తుల సౌలతులు కల్పించేందుకు రూ.30 కోట్లు మంజూరు చేసింది. జంపన్నవాగు అభివృద్ధి కోసం ఇటీవల రూ.5 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ములుగు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com