Telangana : ఆర్ఎంపీలకు మెడికల్ కౌన్సిల్ వార్నింగ్

Telangana : ఆర్ఎంపీలకు మెడికల్ కౌన్సిల్ వార్నింగ్
X

ఓవైపు అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నా, ఇంకా కొందరు ఆర్ఎంపీలు తీరు మార్చుకోవడం లేదని, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలంగాణ వైద్యమండలి చైర్మన్ డా. మహేష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని, దుండిగల్, బాచుపల్లి, సంగారెడ్డి, వనస్థలిపురం, కామారెడ్డి జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి ఆయా పోలీస్ స్టేషన్ ఫరిధిలో కేసులు నమోదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో చాలామంది డాక్టర్ల దగ్గర టెక్నీషియన్లు, నర్సులుగా పనిచేసి సమాజంలో డాక్టర్స్ గా చలామణి అవుతున్నారని, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags

Next Story