Telangana : సీఎం రేవంత్ తో మీనాక్షి భేటీ.. ఆ అంశాలపై చర్చ..

Telangana : సీఎం రేవంత్ తో మీనాక్షి భేటీ.. ఆ అంశాలపై చర్చ..
X

ఏఐసీసీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితి లతో పాటు... నామినేటెడ్ పదవులు, బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సన వ్యూహాల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. కాగా ఉమ్మడి జిల్లాల ఇన్ ఛార్జ్ లు, డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించాక వరుస భేటీ లతో దూకుడు పెంచారు. నిన్న పార్టీ ముఖ్య నేతలతో భేటీ జరిగిన మరుసటి రోజే సీఎంతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అంశంపై సీఎంతో చర్చించినట్లుగా తెలుస్తోంది.

Tags

Next Story